సామాజిక సాధికారత అనేది జగన్ కు ఓ విధానంగా భావించి ఆచరించి అమలు చేయగా, ఇతర రాజకీయ పార్టీలు సాధికారతను కేవలం నినాదాంగా మాత్రమే వాడుకున్నారని విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లుపల్లి సుభద్ర విమర్శించారు. ఆదివాసీల్లోని అన్ని జాతులకు, తెగలకు కూడా రాజకీయంగా పదవులు ఇచ్చి రాజకీయ సాధికారతను కల్పించారన్నారు. రాష్ట్ర కేబినెట్ లో సైతం ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించి అట్టడుగు వర్గాలను అందలం ఎక్కించారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చే హామీల మ్యానిఫెస్టోను దాదాపుగా పూర్తిగా అమలు చేసిన నాయకుడు జగన్ కాగా, ఇతర పార్టీలు మ్యానిఫెస్టోను ఎన్నికల తర్వాత పట్టించుకోలేదని గుర్తు చేసారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించి వైసీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.