గిరిజనుల అభ్యున్నతి కోసం అసమానతలు లేకుండా శాశ్వత పరిష్కారాలు జగన్ చూపుతున్నారని, గతంలో పాలకులు మొసలి కన్నీరు కారుస్తూ సానుభూతిని చూపేవారని, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య, వైద్యం, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు తెలిపారు. అయన మాట్లాడుతూ.... దేశంలో మరే ఇతర సీఎం చేయలేని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివక్ష లేకుండా అమలు చేస్తున్నది జగన్ మాత్రమేనని గుర్తు చేసారు. గిరిజనులకు రెండు జిల్లాలు, రెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటుతో సహా ఎన్నో అభివృద్ధి పనలు చేస్తున్నారని, మనందరం ఈ ఎన్నికల్లో జగన్ వెంటే ఉన్నామని మరోసారి చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.