వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ.... దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76ఏళ్లు. కానీ ఇప్పటిదాకా సామాజిక సాధికారత అన్నది ఒక నినాదంగానే మిగిపోయింది. జగనన్న సామాజిక సాధికారతను ..ఈరోజు ఒక విధానంగా మార్చి చూపారు. మహామహులు, గొప్పగొప్ప నాయకులు సామాజిక సాధికారతకోసం ఎంతగా శ్రమించారో, ఉద్యమాలు చేశారో చరిత్రలో చదువుకున్నాం. అంబేడ్కర్, ఫూలే వంటి మహనీయుల ఆశయాలను ఆదర్శాలుగా చేసుకుని ముందుకు సాగుతున్నారు జగనన్న. సామాజిక సాధికారత విషయంలో జగనన్న వేసిన ముందడుగులు సామాన్యమైనవి కావు. ఆయన ఓ సామాజిక విప్లవాన్నే తీసుకొచ్చారు. రాజకీయపదవులు, అధికారపదవులు బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు కాదనుకున్న బాబులాంటి పాలకుల్ని చూశాం. కానీ నేడు జగనన్న ..ఆ వర్గాల వారే ఆయా పదవుల్లో ఉండాలంటూ ..పదవులు ఇచ్చారు. సామాజిక స్థాయిని పెంచారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల ఆర్థిక స్థాయిని పెంచారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. కులాలకతీతంగా, మతాలకతీతంగా, ప్రాంతాలకతీతంగా, పార్టీల కతీతంగా ...పారదర్శకతతో సంక్షేమపథకాలు గడపగడపకు చేరేలా చేశారు సీఎం జగన్. మహిళల స్వావలంబన కోసం జగనన్న అనేక పథకాలు తీసుకొచ్చారు. ప్రతి మహిళను తన స్వంత అక్క,చెల్లెమ్మలుగా భావించే జగనన్న ..అన్నింటా వారికి యాభై శాతం భాగస్వామ్యం కల్పించారు అని తెలిపారు.