వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా మాజీమంత్రి పేర్నినాని మాట్లాడుతూ.... సామాజిక సాధికార ఉత్సవం ఎందుకు చేసుకుంటున్నామంటే..ఈరోజు జగనన్న పాలనలో బీసీ,ఎస్సీ,ఎస్టీలకు ఎంతో మేలు జరిగింది కాబట్టి. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారు. ఎన్నికల వేళ మాత్రమే ఆ వర్గాలను వాడుకుంటారు. అధికారంలోకి రాగానే వారికి చేసేదేమీ ఉండదు. పదవులు అసలే ఉండవు. మంత్రి పదవులు ఉండవు. బాబు హయాంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు రాజ్యాధికారంలో భాగం లేదు. ఓట్లు మనవి. అధికారం బాబు వర్గానిదే. మన వర్గాలంటే బాబుకు చులకన. జగనన్నకు ఓట్లేసినందుకు ఈరోజు మనకు ఎన్నో పదవులు ఇచ్చారు. ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్లు పెట్టి..వారి పిల్లల తలరాతలు మార్చారు వైయస్సార్. ఆయన హయాంలో ఎంతో మంది ముస్లిం పిల్లలు ఉన్నత చదువులు చదివారు. డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారు. తమ కుటుంబాల తలరాతలే మార్చారు. ఈరోజు జగనన్న పేదల పట్ల ప్రత్యేక అపేక్షతో ఉన్నారు. వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఈరోజు బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాల సామాజిక స్థాయి, ఆర్థికస్థాయి పెరిగిందంటే ..మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వల్లనే. అలాగే అధికార పదవులిచ్చి.. ఉన్నత స్థానాల్లోకి తీసుకెళ్లారు. కలలోనైనా ఊహించని రీతిలో వెనుకబడిన వర్గాల ప్రతినిధులను పార్లమెంటు సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా.. మంత్రులుగా, ఆఖరుకు డిప్యూటీ సీఎంలుగా చేసిన ఘనత జగనన్నది. డ్వాక్రా మహిళల్ని చంద్రబాబు మోసం చేస్తే..వారికి ఇచ్చిన హామీని నెరవేర్చి, వారికి మేలు చేశారు. ఆర్థిక స్వావలంబన సాధించిన ప్రతి మహిళా...సీఎం జగన్ ను స్వంత అన్నయ్యలా భావిస్తోంది. నాడు నమ్మి బాబు ఓట్లేస్తే.. ప్రజల్ని నిండా ముంచారు చంద్రబాబు. నేడు నమ్మి జగనన్నకు ఓట్లేస్తే...ప్రజల జీవనస్థాయిని పెంచారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. చంద్రబాబు ఆరు హామీలంటూ మళ్లీ చెబుతున్నాడు. నమ్మితే మన జీవితాల్ని ఆర్పేస్తాడు. చంద్రబాబు ..బాదుడే బాదుడంటూ ..జగనన్న ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాడు. ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. పేదరికం పోవాలంటే చదువులు పెరగాలి. అందుకే జగనన్న రూ.70వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. పిల్లల చదువులతోనే కుటుంబాల ఆర్థిక పరిస్థితి మారుతుంది అని తెలిపారు.