ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్సీ కాలనీలో మతిస్థిమితం లేని వ్యక్తి మురుగు కాలువలో పడి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. నంద్యాల ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కొంతకాలంగా ఆదోనిలో ఉండేవాడు. మతి స్థిమితం కోల్పోయి ఎమ్మిగనూరు పట్టణంలో తిరుగుతూ కలుగొట్లరోడ్డులో కబరస్తాన్ కొట్టాల ప్రాంతంలో ఉన్న మురుగు కాలువలో పడ్డారు. ఎవరూ గమనించకపోవటంతో మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.