ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. బ్యాంకుల ఆర్థిక పరిస్థితి, పనితీరుపై ప్రధానంగా చర్చించిన వారు.. సైబర్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల కాలంలో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయని, వాటి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ప్రధానంగా చర్చించినట్లు బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే డిపాజిట్లను ఆకర్షించి నిధుల సమీకరణకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాలని సూచించారు.