బాలల హక్కుల రక్షణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఇప్పటికే తాము అనేక బాల్యవివాహాలను అడ్డుకోగలిగామని గుడ్ షెఫర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ సిస్టర్ లత పేర్కొన్నారు.
ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్ లో శనివారం అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. సిస్టర్ లత మాట్లాడుతూ ప్రతి గ్రామంలో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే అందరి సహకారంతో పూర్తిస్థాయి ఫలితాలు సాధిస్తామన్నారు.