కుందుర్పి పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఎస్ఐ వెంకటస్వామి విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ 31వ తేది రాత్రి యువకులు, విద్యార్థులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాత్రి పూట అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జనవరి ఫస్ట్ కార్యక్రమాన్ని శాంతియుతంగా అల్లర్లు లేకుండా నిర్వహించుకోవాలన్నారు.