అనంతపురం జిల్లా ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆదివారం తిరుపతిలో ప్రభుత్వ చీఫ్ విఫ్ కాపు రామచంద్రారెడ్డి, బ్రహ్మసముద్రం సింగల్ విండో అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి రామాంజినేయులు, వైసిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి మాట్లాడుతూ జగనన్న గెలుపుకు ప్రతి కార్యకర్త, నాయకులు కృషి చేయాలన్నారు. వైసిపి గెలుపుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలన్నారు.