పెనుకొండ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివారం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 20వ రోజు సమ్మెలో భాగంగా ఆటపాట కార్యక్రమం ద్వారా నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, మండల కార్యదర్శి బాబావలి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న, జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్, జిల్లా కమిటీ సభ్యులు వెంకటరాముడు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.