పాత రూ. 100 నోట్లు రద్దు విషయంపై RBI క్లారిటీ ఇచ్చింది. ఎట్టిపరిస్థితుల్లోనూ రూ. 100 నోట్లను రద్దు చేయబోమని స్పష్టం చేసింది. కాగా, రూ. 100 నోట్లు రద్దు అంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది.
2024 మార్చి 31వ తేదీ వరకే ఇవి చలామణిలో ఉంటాయని, ఆ తర్వాత RBI వాటిని రద్దు చేస్తుందని పుకార్లు షీకార్లు చేశాయి. ఈ నేపథ్యంలోనే RBI స్పందిస్తూ అదంతా అవాస్తవమని వెల్లడించింది.