126 భారీ చెట్లను అక్రమంగా నరికినందుకు మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా సోదరుడు విక్రమ్ సింహాను బెంగళూరు క్రైంబ్రాంచ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హసన్ జిల్లా నందగొండనహళ్లి గ్రామంలో ప్రభుత్వ భూమిలోని భారీ చెట్లను అనుమతులు లేకుండా కూల్చేశాడని, కలప స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడని విక్రమ్ సింహాపై అటవీ శాఖ అరోపణలు చేసింది. చట్ట ప్రకారం అతడిపై చర్యలు చేపట్టామని కర్ణాటక అటవీ మంత్రి ఈశ్వర్ ఖాంద్రే తెలిపారు.