గుడిలో ప్రసాదం అంటే.. పులిహోర, లడ్డు, దద్దోజనం వంటివి ఉంటాయి. కానీ ఓ ఆలయంలో పానీపూరీలు, పిజ్జాలు, వడాపావ్‌లను నైవేధ్యంగా పెడతారు. ఈ ఆలయం గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా రాజ్‌పుత్‌పరాలో జీవికా మాతాజీ ఆలయం ఉంది.
70 ఏళ్ల నాటి ఈ ఆలయంలో మాతాజీకి ఫాస్ట్‌ఫుడ్ నైవేధ్యంగా పెడతారు. మహిళా భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఉపవాసం కూడా చేస్తుంటారు. మాతాజీ కోరిన కోరికలు తీరుస్తుందని భక్తులు నమ్ముతారు.