ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లోని అచల్ సరోవర్ ఒడ్డున హనుమంతుడి దేవాలయం ఉంది. ఈ గుడిలో హనుమంతుడు ఉడుత రూపంలో ఉంటాడు. మహేంద్రనాథ్ యోగి అనే మహర్షి ఉడుత రూపంలో ఉన్న ఆంజనేయ స్వామిని పూజించినట్లుగా కల వచ్చిందట.
దాంతో ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారు.
ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. భక్తులు 41 రోజుల పాటు పూజలు చేస్తే వారి కష్టాలన్నీ దూరమవుతాయని వారి నమ్మకం. శ్రీకృష్ణుడి సోదరుడు బలరాముడు పూజలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.