కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి మధ్యలో 41 రోజుల పాటు అయ్యప్ప మాలను ధరిస్తారు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులను ధరిస్తారు.
కారణం.. నల్లని రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏ మాత్రం ఉండదని హిందువులు నమ్ముతారు. అలాగే, చలికాలంలో అయ్యప్ప మాల ధరిస్తారు. ఈ సమయంలో నలుపు రంగు దుస్తులను ధరించడం వల్ల సూర్యరశ్మిని గ్రహించి శరీరానికి చలి నుంచి రక్షణ కల్పిస్తుంటాయి