నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా నియమితులయ్యారు. ఆర్థిక సంఘం కార్యదర్శిగా రిత్విక్ రంజనమ్ ఎంపికయ్యారు. ప్రస్తుతం రిత్విక్ రంజనమ్ కేంద్ర ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు.
ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరిట నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. భారత ఆర్థిక వ్యవస్థపై విస్తృత అవగాహన ఉన్న వ్యక్తిగా పనగడియా గుర్తింపు పొందారు.