ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. కొత్త సంవత్సరం తొలి రోజు సోమవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు
తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. భక్తుల రద్దీతో ఆలయ కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తులు శ్రీగిరిలో నూతన సంవత్సర సంబరాలు చేసుకున్నారు, శ్రీశైల పురవీధులు భక్తులతో కళకళలాడాయి.