టిడిపి, జనసేన పార్టీల కూటమితో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆదరించి అధికారాన్ని అందిస్తారని టిడిపి పార్లమెంటు డాక్టర్స్ విభాగం అధ్యక్షులు డాక్టర్ హిమబిందు పేర్కొన్నారు. ఆదివారం గుంతకల్లు పట్టణంలోని జనసేన పార్టీ నాయకులు అరికేరి జీవన్ అధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిమబిందు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జనసేన నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు.