ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 18న ప్రియా అట్లూరితో కుమారుడి నిశ్చితార్ధం,,,,అధికారికంగా ప్రకటించిన షర్మిల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 01, 2024, 06:52 PM

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రేమ వివాహం చేసుకోబోతున్నారే వార్త గత కొంత కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి అట్లూరి ప్రియను ఆయన పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని వార్త పత్రకలు, మీడియా ఛానెళ్లు కూడా కథనాలు ప్రసారం చేశాయి. ప్రియకు షర్మిల తల్లి విజయమ్మ చీర పెట్టిన ఫొటో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. అయితే అధికారికంగా రాజారెడ్డి ప్రేమ వివాహం గురించి షర్మిల, అనిల్ దంపతులు నోరు మెుదపలేదు. తాజాగా.. వారి పెళ్లి విషయమై వైఎస్ షర్మిల న్యూ ఇయర్ రోజున శుభవార్త చెప్పారు. ఈనెల 18 రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం ఉంటుందని ట్వీ్ట్ చేశారు. వచ్చే నెల 17న పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్లు చెప్పారు. ఈ విషయం అందరితో పంచుకోవటం సంతోషంగా ఉందని అన్నారు. 'అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు YS రాజారెడ్డికి, ప్రియమైన అట్లూరి ప్రియాతో జనవరి నెల 18న నిశ్చితార్థం వేడుక, ఫిబ్రవరి 17న 2024 వివాహ వేడుక జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. రేపు (జనవరి 2) మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి, నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడానికి సంతోషంగా ఉంది.' అని ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com