వైఎస్ షర్మిల నేడు మధ్యాహ్నం 2 గంటలకు కుటుంబ సమేతంగా బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయల్దేరి వెళ్లనున్నారు.
కడప విమానాశ్రయానికి చేరుకొని రోడ్డు మార్గం ద్వారా ఇడుపులపాయ ఎస్టేట్ లోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుంటారు. తన కుమారుడి వివాహ ఆహ్వానపత్రికను అక్కడ ఉంచి తండ్రి ఆశీస్సులు తీసుకోనున్నారు. కాగా ఈ నెల 18న రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న వివాహం జరగనుంది.