గుజరాత్‌లోని కచ్ జిల్లా కేంద్రానికి 90 కి.మీ. దూరంలో కాలో దుంగార్ పర్వతం ఉంది. 1500 అడుగుల ఎత్తున్న ఈ పర్వతంపై దత్తాత్రేయుని ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది.
ఈ ఆలయంలోని ప్రసాదాన్ని నక్కలు తింటాయి. పురాణాల ప్రకారం.. దత్తాత్రేయ స్వామి ఈ పర్వతాల మధ్య సంచరించాడని, అప్పుడు కొన్ని నక్కలు ఆహారాన్ని ఆశించి స్వామివారి దగ్గరికి వచ్చాయట. తినడానికి ఏమి లేకపోవడంతో.. నక్కల ఆహారాన్ని తీర్చేందుకు తన చేతినే వాటి ముందు ఉంచారట.