దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత, అధ్యక్ష అభ్యర్థి లీ జే మ్యూంగ్ మీడియాతో మాట్లాడుతుండగా ఓ దుండగుడు కత్తితో దాడిచేశాడు. మంగళవారం ఉదయం బుసాన్లో పర్యటనలో భాగంగా నిర్మాణంలో ఉన్న ఎయిర్పోర్ట్ పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతుండగా దుండగుడు కత్తితో ఆయన మెడపై దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మ్యూంగ్ వెంటనే కిందపడి స్పృహ కోల్పోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.