టీడీపీ నేత నారాయణను నెల్లూరు సిటీ నుంచి రెండోసారి కూడా ఓడించేది నేనే అని వైయస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకునేందుకు మాజీ మంత్రి నారాయణ ఓ ఇద్దరు నేతలకు రూ.50 కోట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. టీడీపీ హయాంలో నెల్లూరులో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. పార్టీ నుంచి టికెట్ కూడా తెచ్చుకోలేని దుస్థితిలో నారాయణ ఉన్నారని పేర్కొన్నారు.