అనంతపురం జిల్లాలోని బెలుగుప్ప మండలంలో ఐదుగురు వాలంటీర్లను తొలగిస్తున్నట్టు ఎంపీడీవో రామచంద్ర సోమవారం తెలిపారు. బెలుగుప్ప సచివాలయం-2లో వాలంటరీగా పనిచేస్తున్న లింగప్ప, పవిత్ర, అనితతో పాటు ఐదు మందిని తొలగిస్తున్నట్టు ఎంపీడీవో పేర్కొన్నారు. విధులు సక్రమంగా నిర్వహిస్తున్న తమను ఎందుకు తొలగించారని ఎంపీడీవోను వాలంటీర్లు ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలగించినట్లు ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa