2023కు వీడ్కోలు పలికి.. 2024 సంవత్సరాన్ని ప్రజలు ఘనంగా స్వాగతించారు. అయితే, గతేడాది జరిగిన పలు ఆసక్తికర, ఆశ్చర్యకర ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్ బ్లింకిట్.. 2023 Blinkit Trends పేరుతో నివేదికను విడుదల చేసింది. దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా ఏడాదిలో 9,940 కండోమ్‌లను ఆర్డర్ చేసినట్లు వెల్లడయ్యింది. దీంతో ఈ విషయం వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి 2023లో ఇంకో పనేమీ పెట్టుకోలేదో ఏమో కానీ... దాదాపు 10 వేల కండోమ్‌లను కొనుగోలు చేశాడు. అతడు రోజుకు సగటున 27 చొప్పున.. గంటకు ఒక్కటిపైగా ఆర్డర్ చేయడం గమనార్హం. వాటిని అతడు నిజంగానే వాడుకున్నాడా? అనే విషయం తెలియదు కానీ... ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.
వినియోగదారుల ప్రవర్తన? వారి అలవాట్లు ఎటు వైపుగా మారుతున్నాయి? అనే అంశాలను విశ్లేషిస్తూ మార్కెట్‌ను ఆకర్షించిన కొన్ని అంశాలను బ్లింక్ ఇట్ వ్యవస్థాపకుడు అల్బిందర్ దిండ్సా వెల్లడించారు. వీటిలో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి. దక్షిణ ఢిల్లీకి చెందిన ఆ వ్యక్తి బ్లింక్ ఇట్ ద్వారా 9,940 కండోమ్‌లను ఆర్డర్ చేసినట్టు దిండ్సా తెలిపారు. అలాగే, మరో వ్యక్తి నెలకు 38 అండర్ వేర్‌లను ఆర్డర్ చేశాడని చెప్పారు. అంటే సగటున రోజుకు ఒకటి కంటే ఎక్కువ కొనుగోలు చేశాడు. మరో కస్టమర్ గతేడాది 4,832 సబ్బులను అంటే.. 13 రోజులకు ఒకటి చొప్పున కొన్నాడు. వీటిని ఆ వ్యక్తి లేదా ఆమె వినియోగిస్తే రెండు గంటల్లోనే ఒక సబ్బును వాడుకున్నాడు. మరో వినియోగదారుడు ఆర్డర్‌లో 101 లీటర్ల మినరల్ వాటర్ కొనుగోలు చేశాడు. అలాగే, మరొకరు 2,670 టూత్ బ్రష్‌లను, మరొకరు 180 లిప్‌స్టిక్‌లను ఆర్దర్ చేయడం గమనార్హం. హైదరాబాద్ వాసి ఏకంగా 17,000 కిలోల రైస్‌ను కొనుగోలు చేయడం విశేషం.
సహజంగా.. కండోమ్స్ అనేవి శృంగారానికి సంబంధించినవి కావడంతో వీలైనంత గోప్యంగా కొనుగోలు చేస్తుంటారు. వీటిని పదులు, వందల సంఖ్యలో కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇతగాడి వాడకం ఏ పాటిదో తెలియదు కానీ... ఒకే ఏడాదిలో 9,940 కండోమ్స్‌ను కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘శృంగార వీర రణధీరా’ అని ఒకరంటే... ముత్యాలముగ్గు సినిమాలోని ‘ఎంతటి రసికుడవో తెలిసెరా...’ అని మరొకరు.. ‘ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్’ అని ఇంకొకరు.. ‘మన్మథుడికి మరో రూపానివా’ అంటూ నెటిజన్లు చలోక్తులు విసురుతూ కామెంట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa