సీఎం వైఎస్ జగన్ ఇవాళ కాకినాడలో పర్యటించనున్నారు. అక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు.
కాగా, జనవరి 1 నుంచి పింఛన్‌ను రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంచి.. ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1 నుంచి 8 రోజులపాటు పెన్షన్ల పెంపు ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.