ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో చేరడానికి పేషెంట్స్ నిరాకరిస్తే అడ్మిట్ చేసుకోవడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పేషెంట్ లేదా అతడి బంధువులు నిరాకరించినా ఐసీయూలో అడ్మిట్ చేయరాదని స్పష్టంచేసింది.
ఈ మేరకు మంగళవారం కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది. 24 మందితో కూడిన నిపుణుల కమిటీ ఈ సిపారసులు చేశారని తెలిపింది.