భారత రెజ్లింగ్ వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. తాజాగా వందల మంది జూనియర్ రెజ్లర్లు ఢిల్లీ జంతర్-మంతర్ కూడలి దగ్గర నిరసనలు ప్రారంభించారు. కానీ ఈసారి భజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్కు వ్యతిరేకంగా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి కారణంగా తాము తమ కెరీర్లో కీలకమైన ఏడాదిని కోల్పోయామని జూనియర్ రెజ్లర్లు పేర్కొంటున్నారు.