ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని కోటగడ్డ వీధి సచివాలయం పరిధిలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ సదుపాయం కలిగి ఉన్న ఆసుపత్రులలో ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.