భర్తపై నిరాధారమైన వివాహేతర సంబంధం ఆరోపణలు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో అతడిని ‘స్త్రీలోలుడి’గా పేర్కొనడం భార్య క్రూరత్వానికి నిదర్శనం అని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది.
ఇది వివాహ రద్దుకు కారణమని తెలిపింది. ఈ మేరకు ఓ భర్త దాఖలు చేసిన విడాకుల కేసులో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. విడాకులకు వ్యతిరేకంగా భార్య వేసిన పిటిషన్ని తోసిపుచ్చింది.