ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు షోడశ దిన ప్రయుక్త 'పంచాయతన పూర్వక సూర్యారాధన' సంకల్పించినట్లు యాగ నిర్వాహకులు వడలి కుమార్ శర్మ చెప్పారు. సంబంధించిన ఏర్పాట్ల కోసం ఈనెల 5న రాటముహూర్తం చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం రాజమండ్రిలోని పేపర్ రోడ్డు సీతంపేటలోని యాగస్థలంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 10నుంచి 25వరకు ప్రతీరోజు సూర్యనమస్కారం, హోమాలు, శతచండీ పారాయణం తదితర పూజలు జరుగుతాయన్నారు.