వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిలారెడ్డి భర్త బ్రదర్ అనిల్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. బ్రదర్ అనిల్ కోసం గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎస్కార్ట్ ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి కేసరపల్లిలో విల్లాకి బ్రదర్ అనిల్ బయలుదేరి వెళ్లనున్నారు. గన్నవరం ఎయిర్పోర్టు వద్ద బ్రదర్ అనిల్ మీడియాతో మాట్లాడుతూ... వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చినట్లు తెలిపారు. తన కుమారుడు రాజారెడ్డి పెళ్లికి సంబంధించిన పనులు జరుగుతున్నాయన్నారు. పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలు షర్మిల మాట్లాడతారని బ్రదర్ అనిల్ చెప్పుకొచ్చారు.