చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి సీఎం జగన్ కాకినాడ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "2014 ఎన్నికల్లో దత్తతండ్రి, దత్తపుత్రుడు ప్రజలను అడ్డగోలుగా మోసం చేశారు.
ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు కనీసం కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేదు. ఈరోజు అదే దత్తపుత్రుడు పేదలకు ఇళ్లపై అవినీతి జరిగిందంటూ కేంద్రానికి లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనేది దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన." అని సీఎం మండిపడ్డారు.