దాదాపు వైసీపీకి చెందిన 33 మంది టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ పేర్కొన్నారు. దివాకర్ రెడ్డి, మైసూరారెడ్డి సహా గతంలో కాంగ్రెస్‌లో వున్నవారిని కలిశానన్నారు. ఏ పార్టీలో ఉన్నా వారందరినీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించానన్నారు. చంద్రబాబు, తాను ఇద్దరం గతంలో యూత్ కాంగ్రెస్ లో ఉన్నామన్నారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై చంద్రబాబుని అడగాలని భావిస్తున్న చింతా మోహన్ తెలిపారు. షర్మిల కాంగ్రెస్ లోకి రావాలని ఆరు నెలలుగా ప్రయత్నం చేశారని తెలిపారు. షర్మిల పార్టీలోకి రావాలని కోరుకుందని కాబట్టి ఆహ్వానిస్తున్నామని చింతా మోహన్ పేర్కొన్నారు. షర్మిల పార్టీలోకి వచ్చిన తర్వాత ఆమె పదవి గురించి ఆలోచిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని..ఆయన్ని అభినందిస్తున్నానన్నారు. రేవంత్ రెడ్డిని ఏపీ ఇన్‌చార్జిని చేయాలని కోరుకుంటున్నానన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ని వైసీపీ నాశనం చేసిందని చింతా మోహన్ పేర్కొన్నారు.