ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 03, 2024, 04:18 PM

విజయనగరం జిల్లా, బాడంగి మండలంలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే..... మండలంలోని కోటిపల్లి గ్రామానికి చెందిన వంగ పండు అన్నపూర్ణ(27)కు అదే గ్రామానికి చెందిన రామారావుతో 2019లో సింహాచలంలో వివాహమైంది. అయితే రామారావుకు ఇది రెండో వివాహం. వీరికి మూడేళ్ల కూతురు మౌనిక ఉండగా మృతురాలు ప్రస్తుతం 3వ నెల గర్భిణి. మొదటి భార్య వద్దనే ఉంటూ భర్త తనను నిర్లక్ష్యం చేస్తుండడంతో పాటు తరచూ గొడవ పడుతుండడంతో విసుగుచెందిన అన్నపూర్ణ మంగళవారం గ్రామంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లి కర్రి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా మని సీఐ తిరుమల రావు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com