ఈ నెల 5న కనిగిరి పట్టణంలో జరిగే చంద్రబాబునాయుడి సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి కోరారు. గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ప్రతి కార్యకర్తలు సమష్టి కృషితో జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు వై.నాగేశ్వరరావు, రామలింగారెడ్డి, టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ వక్కలగడ్డ మల్లికార్జున, పట్టణ అధ్యక్షులు మౌలాలి, మండల అధ్యక్షులు జవ్వాజి రామానుజులరెడ్డి, తర్లుపాడు అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కాకార్ల శ్రీనివాసులు, టీడీపీ నాయకులు తాళ్లపల్లి సత్యనారాయణ, గోపీనాధ్ చౌదరి, శేఖర్‌రెడ్డి, మార్కాపురం, తర్లుపాడు, పట్టణ, మండల, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.