భారతదేశంలో క్యాన్సర్ మరణాలు పెరుగుతున్నాయని లాన్సెట్ మ్యాగజైన్ తెలిపింది. 2019 గణాంకాల ప్రకారం, భారతదేశంలో 12 లక్షల కొత్త కేసులు రాగ, 9.3 లక్షల మరణాలు సంభవించాయి. ఆసియాలో 94 లక్షల కేసులు నమోదు కాగా 56 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో 48 లక్షల కేసులు, 27 లక్షల మరణాలు నమోదయ్యాయి. జపాన్‌లో 9 లక్షల కేసులు, 4.4 లక్షల మరణాలు నమోదయ్యాయని వివరించింది.