తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఆయన విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా.. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక సమీపంలో గురువారం అర్ధరాత్రి రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఎమ్మెల్సీ కారుకు ముందు వెళుతున్న లారీ టైరు పంక్చరు కావడంతో ఒక్కసారిగా నెమ్మదిగా వెళుతోంది. ఆ క్రమంలో కారు వెళ్లి లారీ వెనుక భాగంలో ఢీకొని డివైడర్‌పై పడిపోయింది.
ఈ ప్రమాదంలో చంద్రశేఖర్‌రెడ్డి పీఏ అక్కడికక్కడే చనిపోగా.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తలకు బలమైన గాయాలయ్యాయి. ఇదే సమయంలో ఆ రోడ్డులో వస్తున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. తన కారులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిని ఆస్పత్రిలోకి తరలించారు.. ప్రమాదాన్ని చూసి కారు ఆపిన జానీ మాస్టర్.. ఎమ్మెల్సీకి బలమైన గాయాలు కావడంతో.. తలకి కట్టుకట్టారు.. ఆ తర్వాత ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు క్షతగాత్రులను తన కారులో నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించి తన మంచి మనసు చాటుకున్నారు ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.