అక్రమాస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకమార్పై సీబీఐ దర్యాప్తునకు గత ప్రభుత్వం ఇచ్చిన సమ్మతిని ఉపసంహరిస్తూ సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీబీఐ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై నిన్న విచారణ జరిపిన జస్టిస్ ఎస్.దీక్షిత్.. డివిజన్ బెంచ్‌కు పంపాలని సీజేకు సిఫారసు చేశారు. ఇలాంటి కేసు మొదటిదని, ఇందులోని చట్టపరమైన సమస్యలను పరిశీలించేందుకు విస్తృత ధర్మాసనం అవసరమని అభిప్రాయపడ్డారు.