డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర ముగిసింది. శుక్రవారం మలికిపురం ప్రధాన రహదారి నుంచి వైయస్ఆర్సీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు అభిమాన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువకులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తమకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ నాయకులు ప్రసంగించారు.