వైయస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర భాగంగా నేడు(శనివారం) విశాఖ నార్త్ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు వైయస్ఆర్సీపీ ప్రతినిధుల మీడియా సమావేశం ఉండగా, పన్నెండు గంటలకు అక్కయ్యపాలెం ఎన్జీవోస్ కాలనీలో స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు మాధవధార లాస్ట్ బస్ స్టాప్ నుండి బైక్ ర్యాలీ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు పోర్ట్ హాస్పిటల్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ రీజనల్ ఇన్ఛార్జి వైవీ సుబ్బా రెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, కారుమురి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్, తదితరులు హాజరుకానున్నారు.