యువత క్రీడల పై ఆసక్తి కనబరిచి తద్వారా అభివృద్ధి చెందాలని గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు అన్నారు. ఈ మేరకు శనివారం సంజీవపురం గ్రామంలోని అల్లూరి సీతారామరాజు యూత్ సభ్యులకు క్రీడల నిమిత్తం 10వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని సువర్ణ రాజు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని యువత వాలీబాల్ కబడ్డీ వంటి సాంప్రదాయ బద్దమైన ఆటలపై దృష్టి పెట్టాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa