సొంత విధానాలతో సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల సుడిగుండంలోకి నెట్టారని మాజీమంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. సంపద సృష్టి చేతకాక అప్పుల కోసం అడ్డగోలుగా తప్పులు చేశారన్నారు. అదనపు అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదన్నారు. అభివృద్ధి కోసం ఖర్చు శూన్యమని.. ఒక్కరికి కూడా ఉపాధి కల్పించలేదని దేవినేని ఉమ పేర్కొన్నారు. మరి తెచ్చిన లక్షల కోట్ల డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని ప్రశ్నించారు. ఒక్కఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని దేవినేని ఉమ పేర్కొన్నారు.