దేశ రాజధాని ఢిల్లీలో శనివారం చల్లటి గాలులు చలి తీవ్రత అధికంగా పెరిగిపోయింది. దీంతో భారత వాతావరణ శాఖ ఢిల్లీకి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు శితాకాల సెలవులను జనవరి 10 వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. శనివారం పొరపాటున సెలవు ఆర్డర్ జారీ చేయబడిందని విద్యా శాఖ తన తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ విషయంలో ఆదివారం తుది నిర్ణయం తీసుకోనున్నారు.