ఇటీవల బాలికల వసతి గృహం నుండి కనిపించకుండా పోయిన 26 మంది బాలికలు క్షేమంగా ఉన్నారని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు.
ఈ మేరకు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న వసతి గృహం నుంచి బాలికలు అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విషయం పై సీఎం మోహన్ యాదవ్ స్పందిస్తూ ఆ బాలికలను గుర్తించామన్నారు. అలాగే అక్రమంగా వసతి గృహాలు నిర్వహిస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.