శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ విశాఖ కలెక్టర్ మల్లికార్జునను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ శనివారం వినతిపత్రం అందజేశారు.
వాల్తేరు సిమెట్రీ విషయమై చర్చించారు. ఇక్కడ గల శ్మశాన వాటిక స్థలం లేకపోవడం వలన అంత్యక్రియలు చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కొత్తగా స్థలాన్ని కేటాయించాలని కోరారు.