సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) బృందం ఏపీలో మూడు రోజుల పాటు పర్యటించనుంది. సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో సోమవారం విజయవాడ చేరుకోనున్న
ఈసీ బృందం మంగళవారం రాజకీయ పార్టీలతో భేటీ కానుంది. అలాగే ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై రాష్ట్ర అధికారులతో చర్చించనుంది. జనవరి 10వ తేదీన మీడియా సమావేశం అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్లనుంది.