ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయంపై ఉన్న హిందూ మతం చిహ్నాల జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి.
20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరీ జగన్నాథ్ ఆలయ పై భాగాన ఏర్పాటు చేశారు. పూరీ పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఈ ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం మరో ఆశ్చర్యకర విషయం. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు.