శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలో సమస్యలపై చేపట్టిన పాదయాత్రకు 4 వరోజు ఆదివారం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గం ఇంచార్జ్ బి. కె. పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్బంగా చైతన్య పాదయాత్ర కు సంఘీభావం తెలిపారు. అనంతరం పట్టుచీరల పాలిష్ కార్మికులతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.