నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో కాటన్ మిల్లు, పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఐదుగురు బాల కార్మికులను ఆపరేషన్ స్మైల్ టీం శనివారం పోలీసులకు అప్పగించింది. ఎస్ఐ పి.శంకరయ్య నేతృత్వంలో శనివారం తిప్పర్తి మండలంలోని రామలింగాలగూడెం సత్యనారాయణ కాటన్ మిల్లులో, తిప్పర్తిలోని హచ్పీ పెట్రోల్ బంక్‌లో తనిఖీలు నిర్వహించారు. కాటన్ మిల్లులో బీహార్‌కు చెందిన నలుగురు, పెట్రోల్ బంకులో ఒక బాల కార్మికుడిని గుర్తించారు.